జాతీయ వార్తలు

ప్రజలకు క్షమాపణ చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : జైల్లో తనను చిత్ర హింసలు పెట్టినందుకు తాను పెట్టిన శాపం కారణంగానే 26/11 వీర జవాన్ హేమంత్ కర్కారే మరణించాడంటూ మాలేగావ్ పేలుళ్ళ కేసు నిందితురాలు, భోపాల్‌లో బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్య తీసుకోవాలని కూడా కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ఓయోధుడిపై ప్రజ్ఞా ఠాకూర్ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయ డం విస్మయాన్ని కలిగిస్తున్నదని సూర్జేవాలా అన్నారు. 26/11 వీర జవాను హేమంత్ కర్కారేపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అన్నది బీజేపీకే చెల్లుతుందని పేర్కొన్నారు. వీర జవానును అవమానించినట్లేనని, దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందేనని, ప్రజ్ఞా ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.