జాతీయ వార్తలు

ఇదో పెద్ద కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తిరస్కరించారు. వీటి వెనుక పెద్ద కుట్ర ఉందని, ఈ ఆరోపణలన్నీ నిరాధారమంటూ కొట్టి వేశారు. తనపై ఈ ఆరోపణలు చేసిన ఆ మహిళ వెనుక కొన్ని పెద్ద శక్తులే ఉన్నాయని ఆయన అన్నారు. తనపై ఈ రకమైన ఆరోపణలు రావడం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. ఈ ఆరోపణలపై ఆయన శనివారం సుప్రీంకోర్టులో అసాధారణ స్థాయిలో విచారణ జరిపారు. ‘ఇలాంటి ఆరోపణలను ఖండించాల్సిన పరిస్థితి వస్తుందని కూడా నేను ఎన్నడూ అనుకోలేదు. కాని, న్యాయమూర్తిగా రెండు దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలు అందించిన తరువాత ఆ పరిస్థితి వచ్చింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే గొగోయ్ హడావుడిగా విచారణకు ఆదేశించారు. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఈ విచారణలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ అంశాన్ని ‘మీడియా వివేచన’కు వదిలేసింది. సంయమనం పాటించాలని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలుగకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. సుమారు అరగంట సేపు సాగిన విచారణ సందర్భంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రత తీవ్రమయిన ముప్పును ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏదో పెద్ద శక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని చైతన్యరహితం చేయాలని కోరుకుంటోందని, అందులో భాగంగానే సీజేఐపై నీతినియమాలు లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు చేయించడం జరిగిందని తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సీజేఐపై చేసిన ఆరోపణలకు సంబంధించి కొన్ని న్యూస్ పోర్టల్‌లలో వార్తాకథనాలు ప్రచురితమయిన వెంటనే శనివారం సుప్రీంకోర్టులో అసాధారణ స్థాయిలో విచారణ జరిగింది. ‘న్యాయ వ్యవస్థను బలిపశువును చేయజాలరు’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మీడియా వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా సదరు మహిళ ఫిర్యాదును ప్రచురించి ఉండకూడదని వ్యాఖ్యానించింది. తన నేతృత్వంలోని ధర్మాసనం చాలా సున్నితమయిన కేసులను విచారించనున్న తరుణంలో ఈ ఆరోపణలు వచ్చాయని సీజేఐ గొగోయి తెలిపారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నది కూడా ఈ నెలలోనే అని పేర్కొన్నారు. ధర్మాసనంలో సీజేఐతో పాటు న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని సడలించేంత తీవ్రత గల ఈ వివాదం వెనుక ఒక ‘పెద్ద శక్తి’ ఉందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ధర్మాసనానికి సీజేఐ నేతృత్వం వహించినప్పటికీ, జ్యుడీషియల్ ఆర్డర్ జారీ చేసే అంశాన్ని మాత్రం ఆయన అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ మిశ్రాకు వదిలేశారు. ఇప్పుడే జ్యుడీషియల్ ఆర్డర్ జారీ చేయదలచుకోలేదని, ఈ అంశాన్ని మీడియా వివేచనకే వదిలేస్తున్నామని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. మీడియా దేనిని ప్రచురించాలి, దేనిని ప్రచురించకూడదు అనే విషయంలో సంయమనం పాటించాలని సూచించింది. ‘డబ్బు విషయంలో నన్ను ఎవరూ పట్టుకోలేరు. అందుకే వారు మరో అంశం కోసం వెతికారు. వారు ఈ అంశాన్ని ఎంచుకున్నారు’ అని సీజేఐ గొగోయి అన్నారు. న్యాయమూర్తిగా రెండు దశాబ్దాల పాటు సేవలందించిన తరువాత తన బ్యాంకు ఖాతాలో రూ. 6.80 లక్షలతో పాటు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో రూ. 40 లక్షలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.