జాతీయ వార్తలు

మోదీ వస్తేనే భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 20: భారతదేశం మరింత సురక్షితం కావాలంటే నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవలసిన అవసరం ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలన్నా మోదీ దేశ ప్రధానిగా ఉంటే సాధ్యమవుతుందని శనివారం నాడు ఇక్కడ జరిగిన భారీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా అన్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అధ్యక్షుడు యెడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర తరపున శిమోగాలో అమిత్ షా ప్రచారం చేశారు. ఈ నియోజక వర్గంలో రాఘవేంద్రతో మరో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప జేపీఎస్ తరపున తలపడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా రాఘవేంద్రను పార్లమెంట్‌కు ఎన్నుకోవడమే గాకుండా, నరేంద్ర మోదీని ప్రధానిగా మళ్లీ నిలబెట్టాల్సిన అవసరం ఉందని అమిత్ షా అన్నారు. దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన, పాకిస్తాన్‌కు గట్టిగా జవాబు ఇవ్వడానికి మోదీని ప్రధానిగా మళ్లీ ఎన్నుకోవడం ఒక్కటే మార్గమని అమిత్ షా అన్నారు.
తాను కూడా ఈ నెల 23న గుజరాత్ గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలను ఎదుర్కొంటున్నానని, అయినా కూడా రాఘవేంద్ర విజయం కోసం ప్రచారం చేయడం కోసం వచ్చానని అమిత్ షా తెలిపారు. ఈ ర్యాలీ అంతా మోదీ.. మోదీ.. అనే నినాదాలతో మారుమోగింది. ర్యాలీ సాగిన మార్గమంతా బీజేపీ కార్యకర్తలు ఆనందోత్సాహలతో నృత్యాలు చేశారు.
చిత్రం... కర్నాటకలోని షిమోగాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా