జాతీయ వార్తలు

పంజాబ్ గవర్నర్‌గా ప్రమాణం చేసిన బద్నోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 22: పంజాబ్ కొత్త గవర్నర్‌గా వి.పి.సింగ్ బద్నోర్ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్, హర్యానాల హైకోర్టు న్యాయమూర్తి ఎస్.జె.వాజిఫ్‌దార్ రాజ్‌భవన్‌లో ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ హాజరయి, బద్నోర్‌కు అభినందనలు తెలిపారు. బద్నోర్ చండీగఢ్‌కు పాలనాధికారిగా కూడా వ్యవహరిస్తారు. ఇంతకుముందు హర్యానా గవర్నర్ కె.ఎస్.సోలంకి పంజాబ్ ఇంచార్జ్ గవర్నర్‌గా వ్యవహరించారు. ఆయన స్థానంలో 69ఏళ్ల బద్నోర్ నియమితులయ్యారు. బద్నోర్ రాజస్థాన్ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ రాష్ట్రానికి నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. 2010 జూలైలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ అని బద్నోర్ అజ్మీర్‌లోని మాయో కాలేజీలో, హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.