జాతీయ వార్తలు

ప్రచార జోరులో.. నోరుజారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రాఫెల్ యుద్ధ విమానాల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేయక తప్పలేదు. ఎన్నికల ప్రచార జోరులో ఈ ఆరోపణ చేశానని రాహుల్ గాంధీ సోమవారం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వివరించారు. ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారు దొంగ) అని సుప్రీం కోర్టు కూడా అంగీకరించిందని రాహుల్ గాంధీ ఏప్రిల్ 10న అమేథీలో జరిగిన ఒక బహిరంగ సభలో చెప్పారు. రాహుల్ గాంధీ సోమవారం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తీర్పును వక్రీకరించినందుకు విచారాన్ని వ్యక్తం చేశారు. ‘ఎన్నికల ప్రచార జోరులో చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ) అని కోర్టు కూడా అంగీకరించిందని ఆరోపించాను.. కోర్టు తమకు క్లీన్‌చిట్ ఇచ్చిందంటూ ప్రత్యర్థులు ప్రకటించుకున్నందుకు ప్రతిగా తానీ ఆరోపణలు చేశాను’ అని రాహుల్ గాంధీ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల జోరులో తాను చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ అఫిడవిట్‌లో ఆరోపించారు. ‘చౌకీదార్ చోర్ హై’ అన్న వ్యాఖ్య కోర్టులు చేయవని తాను నమ్ముతున్నట్లు రాహుల్ తెలిపారు. సుప్రీం కోర్టు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దొంగగా గుర్తించిందంటూ రాహుల్ చేసిన విమర్శలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. తన అభిప్రాయాలను రాహుల్ సుప్రీం కోర్టుకు అపాదిస్తున్నారు.. సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని మీనాక్షి లేఖి పిటిషన్‌లో డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీని ఆదేశించింది. రాహుల్ గాంధీ అన్నట్లు తామెప్పుడూ చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ) అని వ్యాఖ్యానించలేదు..
అలాంటి అభిప్రాయాన్ని కూడా వెల్లడించలేదని సుప్రీం కోర్టు రాహుల్‌కు ఇచ్చిన నోటీసులో స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు రాహుల్ గాంధీ సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కోర్టు తీర్పును వక్రీకరించినందుకు విచారాన్ని వ్యక్తం చేశారు. తానిక మీదట ఎన్నికల బహిరంగ సభల్లో ఎలాంటి అభిప్రాయాలు, వ్యాఖ్యలు, పరిశీలనలను కోర్టు తీర్పులతో ముడిపెట్టనని హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు అధికారింగా ప్రకటించే తీర్పులు, వ్యాఖ్యలు, పరిశీలనలను మాత్రమే ఉటంకిస్తానని ఆయన వివరించారు. మీనాక్షి లేఖి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం అఫిడవిట్ దాఖలు చేయటం గమనార్హం.
రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందే
తాను చేసిన తప్పుకు విచారాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదు, రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని మీనాక్షి లేఖి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి జరిగిన తప్పుకు విచారాన్ని వ్యక్తం చేసిన అనంతరం మీనాక్షి లేఖి స్పందిస్తూ ఈ డిమాండ్ చేశారు. చౌకీదార్ చోర్ హై (కాపరాదారుడు దొంగ) అని సుప్రీం కోర్టు అంగీకరించిందని రాహుల్ ఏప్రిల్ పదో తేదీనాడు అమేథీలో జరిగిన బహిరంగ సభలో ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేసిన అనంతరం విచారాన్ని వ్యక్తం చేస్తే కోర్టు వౌనం వహించాలా? అని లేఖి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును వక్రీకరించారు.. అబద్థం చెప్పారు.. అనేది ఆయన అఫిడవిట్ అంగీకరించింది కాబట్టి సుప్రీం కోర్టు అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చిత్రం... ఎన్నికల ప్రచారం నిమిత్తం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీకి చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ