జాతీయ వార్తలు

ఓబిసి పార్లమెంటరీ కమిటీకి చట్టబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రాజ్యాంగం కల్పించిన 27 శాతం రిజర్వేషన్లు ఓబిసిలకు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఓబిసి పార్లమెంటరీ కమిటీకి చట్టబద్ధత కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బిసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో గురువారంనాడు ఏపి భవన్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిపి మండల్ 98వ జయంతి కార్యక్రమంలో దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు రాపోలు అనంద్‌భాస్కర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, ఓబిసి పార్లమెంటరీ కమిటీకి చట్టబద్ధత కల్పించడానికి అన్ని పార్టీలు ఏకాభిప్రాయం అవసరమన్నారు. ఓబిసి పార్లమెంటరీ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. బిసిల అభ్యున్నతికి బిపి మండల్ కృషి అభినందనీయమని, ఆయన సామాజిక న్యాయం కోసం పాటుపడిన గొప్ప పార్లమెటేరియన్ అని అన్నారు. బలహీన వర్గాల్లో బిపి మండల్ వెలుగు తీసుకొచ్చారని, పేదల కోసం జీవితాన్ని త్యాగం చేశారని మంద కృష్ణమాదిగ అన్నారు.