జాతీయ వార్తలు

రాహుల్ విమానంలో సాంకేతిక లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం బయలుదేరిన కొద్దిసేపటికి అందులోని ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హుటాహుటిన ఢిల్లీకి ఆయన తిరిగివచ్చారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ ట్విట్టర్‌లో ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ‘పాట్నా వెళ్తుండగా మా విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు వెనుకకు తిరిగొచ్చాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘సంస్థీపూర్ (బిహార్), బాలాసోర్ (ఒడిశా), సంగమ్‌నెర్ (మహారాష్ట్ర)లో జరిగే ఎన్నికల సభలకు మేము హాజరుకావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆయా సమావేశాలకు ఆలస్యంగా హాజరవుతున్నందుకు క్షమాపణలు’ అని రాహుల్ ఆ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఇదిలావుండగా, సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ సాంకేతిక సమస్య తలెత్తడంతో హాకర్ 850 ఎక్స్‌పీ ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-కేఎన్‌బీని ఢిల్లీకి తిరిగి వచ్చిందని తెలిపారు. విమానం వెనుకకు తిరిగొచ్చిన అంశంపై డీజీసీఏ సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆయన పీటీఐ ప్రతినిధికి తెలిపారు. విమానం ఉదయం 10.20 గంటలకు సురక్షితంగా ఢిల్లీకి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో విమానంలో పది మంది ఉన్నారని, వీరిలో ఇద్దరు విమాన సిబ్బంది కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఏప్రిల్ 26న రాహుల్‌తోపాటు కొంతమంది ఎన్నికల సందర్భంగా ఢిల్లీ నుంచి కర్నాటకలోని హుబ్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా తొలిసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది.