జాతీయ వార్తలు

బుందేల్‌ఖండ్‌కు మీరు చేసిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝాన్సీ, ఏప్రిల్ 26: ప్రధాని నరేంద్ర మోదీ బుందేల్‌ఖండ్‌కు చేసిందేమిటని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిలదీశారు. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలో దాహర్తి తీర్చడానికి మోదీ ఏం చర్యలు తీసుకున్నారని మాజీ సీఎం నిలదీశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ‘బాబా సీఎం’అని సంభోదిస్తూ నిన్నటి వరకూ బాబాలంటే ఎంతో విశ్వాసం ఉండేదని యూపీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు చూశాక ఆ భ్రమలు పోయాయని వ్యాఖ్యానించారు. ఝాన్సీలోని శుక్రవారం ఓ ఎన్నికల సభలో మాట్లాడిన అఖిలేష్ ‘ఓ సారి బుందేల్‌ఖంఢ్‌లో పర్యటించిన ప్రధాన మోదీ తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని కచ్‌కు సంబంధించి ఓ కథను జనానికి చెప్పారు. బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్యను తీర్చి మీ జీవితాలే మార్చేస్తానని ఆనాడు మోదీ హామీ ఇచ్చి వెళ్లారు... ఏమైంది?’అని ఎస్‌పీ అధినేత నిలదీశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ తుంగలోతొక్కారని మోదీపై విరుచుకుపడ్డారు. స్థానిక ఎంపీ ఉమాభారతిపై అఖిలేష్ విమర్శలు గుప్పించారు. ‘జల వనరుల మంత్రిగా ఉమాభారతి ఏం చేశారు?. బుందేల్‌ఖండ్‌కు నీళ్లులేవు. గంగానది శుద్ధి ఆ దేవుడికే ఎరుక’అని ఎద్దేవా చేశారు. ఝాన్సీ ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే ఈసారి ఆమె పోటీ చేయడం లేదని అఖిలేష్ ధ్వజమెత్తారు. యోగి బాబా ముఖ్యమంత్రిగా వచ్చి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే, మెట్రో స్టేషన్ గురించి హామీలు గుప్పించారని, తీరా చూస్తే ఒక్కటీ రూపుదిద్దుకోలేదని ఎస్‌పీ చీఫ్ విరుచుకుపడ్డారు. తమ హయాంలో ఝాన్సీ అభివృద్ధికి రాష్ట్ర వాటా నిధులు కేటాయిస్తే కేంద్రం సహకరించలేదని ఆరోపించారు.