జాతీయ వార్తలు

అంతా మాకే అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి సారి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ ఇంకంబెన్సీ)కు బదులు ప్రభుత్వ అనుకూలత (ప్రో ఇంకంబెన్సీ) చోటు చేసుకున్నదని, ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాన మంత్రి పదవి కొడుకులు, కూతుళ్లు, బాబాయి, తమ్ముళ్లు, ఇతర బంధువుల కోసం కాదు, దేశంలోని 130 కోట్ల మంది సంక్షేమం కోసమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి పదవి అనేది ఒక తపస్సు, దేశం కోసం దీనిని ప్రతి క్షణం కరిగించవలసి ఉంటుందని ఆయన ఆవేశంతో అన్నారు. గత ఐదు సంవత్సరాలు తానీ విధంగానే పనిచేశానని మోదీ చెప్పారు. నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం వారణాసి నుండి రెండోసారి పోటీ చేసేందుకు తన నామినేషన్ దాఖలు చేసే ముందు పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, అకాలీదళ్ అధినాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన అధినాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు మోదీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మామూలుగా అయితే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చోటుచేసుకుంటుందని, కానీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి 3ప్రభుత్వ అనుకూలత2 (ప్రో ఇంకంబెన్సీ) నెలకొందని చెప్పారు. ఇది ఎలా సంభవించిందనేది అర్థం చేసుకునేందుకు రాజకీయ పండితులు ఆలోచించవలసి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి, పాసీ ఘాట్ నుండి పోర్‌బందర్ వరకు దేశంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొన్నది, మరోసారి మోదీ ప్రభుత్వం అని దేశ ప్రజలే చెబుతున్నారని ప్రధాన మంత్రి ప్రకటించారు. దేశంలో ఇప్పటికి ఎన్నో ఎన్నికలు జరిగాయని, అయితే ఎన్నడూ లేనిది ఈసారి ప్రభుత్వ అనుకూలత చోటుచేసుకున్నదని, ఇది ఎలా జరిగిందనేది తెలుసుకునేందుకు రాజకీయ పండితులు తమ బుర్ర గోక్కొనక తప్పదని మోదీ వ్యాఖ్యానించారు. 3బీజేపీని గెలిపించాలనే నిర్ణయం ప్రజలు తీసేసుకున్నారు, వారికి మనం ప్రతి క్షణం రుణపడి ఉంటాం2 అని ఆయన కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల కృషి, ప్రజల ప్రేమ మూలంగానే గురువారం వారణాసిలో లక్షలాది మంది తన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారని మోదీ అన్నారు. నేనికమీదట ఎన్నికల ప్రచారానికి వారణాసి రాను, ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయవలసి ఉన్నది, అందుకే మీరంతా నరంద్ర మోదీలే, మీరంతా ప్రధాన మంత్రి అభ్యర్థులే, మీరే నాకు భారీ మెజారిటీ సంపాదించాలి2 అని మోదీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హరహర మహాదేవ్ అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ మరోసారి హరహర మహాదేవ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రధాని ప్రకటనపై చర్చ
దేశంలో ప్రభుత్వ అనుకూలత నెలకొన్నదంటూ నరేంద్రమోదీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మామూలుగా అయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే మోదీ లెక్క ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ అనుకూలత చోటుచేసుకున్నది. నరేంద్ర మోదీ ప్రయోగించిన కొత్త పదం 3ప్రభుత్వ అనుకూలత2ను ఎలా తిప్పికొట్టాలనేది ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావటం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తమదేనని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ భావిస్తోంది, అయితే ఈవీఎంలు లెక్కించిన తరువాత కానీ మోదీ ప్రభుత్వం పట్ల ఏ మేరకు వ్యతిరేకత నెలకొన్నదనేది వెలుగులోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ శుక్లా చెప్పారు. కొత్త పదాలను ప్రయోగించటం నరేంద్ర మోదీకి అలవాటే, అందుకే ఆయన ఇప్పుడు ప్రభుత్వ అనుకూలత అనే కొత్త పదాన్ని ప్రయోగించారని రాజీవ్ శుక్లా విమర్శించారు.
లోక్‌సభకు ఇంతవరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తమకే వస్తున్నాయని నరేంద్ర మోదీ అంచనా వేస్తున్నారు, అయితే కాంగ్రెస్ పార్టీకి అందిన సమాచారం ప్రకారం బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకి ఆశించినన్ని సీట్లు లభించటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మెజారిటీ లభించిందని రాజీవ్ శుక్లా చెప్పారు. దేశంలో ప్రభుత్వ అనుకూలత చోటుచేసుకుంటే వారణాసిలో నరేంద్ర మోదీ బల ప్రదర్శన ఎందుకు నిర్వహించారని శుక్లా ప్రశ్నించారు. ఎన్‌డీఏకి ఓట్లు పడటం లేదనే వాస్తవం వెలుగులోకి వచ్చింది కాబట్టే పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని మోదీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునివ్వవలసి వచ్చిందని శుక్లా విమర్శించారు.