జాతీయ వార్తలు

స్వామి పిటిషన్‌కు బదులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేషనల్ హెరాల్డ్ కేసులో బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. పార్టీకి, అసోసియెటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఎజెఎల్)కు చెందిన కొన్ని పత్రాలను అందజేయవలసిందిగా సుబ్రహ్మణ్య స్వామి తన తాజా పిటిషన్‌లో కోరారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లలీన్.. సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ ఇతర నాయకులయిన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శాంపిట్రోడాలకు రెండు వారాలలోగా సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను కలిగి ఉన్న సంస్థ ఎజెఎల్‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణం వివరాలకు సంబంధించిన పత్రాలను అందజేయవలసిందిగా స్వామి తన తాజా పిటిషన్‌లో కోరారు. కేసు విచారణకు ఈ పత్రాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్‌కు ఎజెఎల్ సమర్పించిన పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్స్‌కు సంబంధించి ఎజెఎల్ ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన పత్రాలు కూడా కావాలని స్వామి కోరారు.