జాతీయ వార్తలు

హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌లలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా/అహ్మదాబాద్, ఆగస్టు 27: హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో శనివారం ఒక మోస్తరు తీవ్రతతో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉదయం 6 గంటల 46 నిమిషాలకు తొలి ప్రకంపన, 7 గంటల 5 నిమిషాలకు రెండో ప్రకంపన, 9 గంటల 2 నిమిషాలకు మూడో ప్రకంపన సంభవించాయని, రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత వరుసగా 4.6, 4.3, 4.2గా నమోదైందని స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్నోహన్ సింగ్ వివరించారు. కులూ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనలు సంభవించాయని ఆయన తెలిపారు. అయితే శనివారం ఉదయం ఏకధాటిగా 15 సార్లు ప్రకంపనలు సంభవించాయని, దీంతో తామంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశామని కులూ జిల్లాతో పాటు సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్ ప్రజలు వెల్లడించారు. ఈ ప్రకంపనల ధాటికి కులూలోని అనీ ఏరియాతో పాటు కింగల్, కుమార్‌సెయిన్ ప్రాంతాల్లో కొన్ని పాత భవనాలు బీటలు వారడంతో పాటు రామ్‌పూర్, కులూలోని ఎగువ ప్రాంతాల నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చాయని, అయితే ఎటువంటి ప్రాణ నష్టంగానీ, పెద్దగా ఆస్థి నష్టంగానీ జరగలేదని రామ్‌పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిశాంత్ థాకూర్ తెలిపారు.
గుజరాత్‌లో
ఇదిలావుంటే, గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో కూడా శనివారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని వలన ప్రాణ నష్టంగా గానీ ఆస్థి నష్టం గానీ తలెత్తకపోయినప్పటికీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జూనాగఢ్ జిల్లాలోని మంగ్రోల్ తీరానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరాన అరేబియా సముద్ర ప్రాంతం కేంద్రంగా మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైందని గాంధీనగర్‌లోని సిస్మోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.