జాతీయ వార్తలు

ఆసుపత్రిలో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్హంపూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 27: పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ వైద్య కళాశాల ఆసుపత్రిలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు ఆయాలు మృతి చెందారు. ఆసుపత్రిలో ఉదయం 11.50 గంటలకు మంటలంటుకోవడంతో భయభ్రాంతులకు గురయిన రోగులు, సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట సంభవించి ఇద్దరు ఆయాలు మృతి చెందారని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విశ్వరంజన్ సత్పతి కోల్‌కతాలో పిటిఐ ప్రతినిధికి చెప్పారు. ఆసుపత్రి ప్రధాన మెడికల్ వార్డు వద్ద గల ఖాళీగా ఉన్న విఐపి క్యాబిన్ ఎసి మెషిన్ వద్ద మంటలు లేచాయని ఆయన తెలిపారు. మంటలనుంచి తప్పించుకోవడానికి అందరూ ఒక్కసారిగా పరుగుతీయడంతో తొక్కిసలాట సంభవించిందని ఆయన వివరించారు. పక్కన గల వార్డుల్లో ఉన్న రోగులను వెంటనే ఇతర వార్డుల్లోకి తరలించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందాన్ని కోల్‌కతా నుంచి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని ఆయన వివరించారు. సంఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు.