జాతీయ వార్తలు

పేగు బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నబిడ్డను కాపాడుకోడానికి తన ప్రాణాలనే త్యాగం చేసి పేగు బంధానికి నిర్వచనం చెప్పింది ఓ అమ్మ.. ఏ దేశంలోనైనా, ఏ ఖండంలోనైనా మాతృప్రేమ ఒకేలా వుంటుంది. అమెరికాలో సరదాగా ఓ కుటుంబ బోట్లో షికారు చేస్తుండగా, రెండేళ్ల బాలుడు అకస్మాత్తుగా నీళ్లలో పడిపోయాడు. అది గమనించిన ఆ బాలుడి తల్లి చెల్సీ రస్సెస్ (35) ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి పిల్లాడిని పైకితీసి బోటులోని వారికి అందించి తాను మునిగిపోయింది. కొంతసేపటికి చెల్సీని కూడా వెలికితీశారు. అయితే అప్పటికే జరగరానిది జరిగిపోయింది. బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, ఆ మాతృమూర్తి మాత్రం విగతజీవిగా మారిపోయింది. చెల్సీ మారథాన్ విజేత అని, గతేడాది వందమైళ్ల పరుగులో విజయం సాధించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.