జాతీయ వార్తలు

లంచం ఇచ్చేందుకు బిచ్చగాడి అవతారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు ఓ పిల్లవాడు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. తండ్రి చనిపోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సాధించుకునేందుకు అధికారి లంచం అడగటంతో ఆ పిల్లవాడు సదరు లంచం మొత్తాన్ని సంపాదించేందుకు బిచ్చం ఎత్తుకోవలసి వచ్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కున్నత్తూర్‌లో అజిత్ అనే పదిహేనేళ్ల పిల్లవాడి తండ్రి నిరుడు చనిపోయాడు. అంత్యక్రియలకు డబ్బు లేకపోవటంతో అప్పుచేసి మరీ దహన సంస్కారాలను పూర్తిచేశాడు. అయితే తండ్రి మరణానికి పరిహారం కోసం ప్రభుత్వాన్ని కాళ్లరిగేలా తిరిగి అర్థిస్తే ఏడాది తరువాత రూ.12, 500 సాయం ప్రకటన వచ్చింది. ఇక దానికి సంబంధించిన చెక్ ఇవ్వటానికి సంబంధిత అధికారి సుబ్రమణియన్ రూ.3వేలు లంచం అడిగాడు. దీంతో అజిత్ చేసేదేమీ లేక, సదరు అధికారికి లంచం ఇచ్చేందుకు తగిన డబ్బులు కావాలంటూ ఓ బ్యానర్ చేత పట్టుకుని వీధుల్లో బిచ్చమెత్తటం మొదలెట్టాడు. దీంతో అధికారి వ్యవహారం వీధికెక్కింది. అక్కడి నుంచి ఫోటోలు, సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కింది. వివాదం చినికి చినికి గాలివానై, సర్కారుకు సెగ తగలటంతో సుబ్రమణియన్‌ను విధుల నుంచి పై అధికారులు తొలగించారు.