జాతీయ వార్తలు

రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 28: రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాలని, ప్రభుత్వ, పరిపాలనకు సంబంధించిన అంశాల్లో భాగస్వాములై సమాజంలో కోరుకున్న మార్పును తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ విద్యార్థులకు సూచించారు. ఆదివారం బెంగళూరులో ఆయన ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు (నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ) 24వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు. ‘న్యాయ విద్యార్థులంతా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి మన రాజకీయ వ్యవస్థతో పాటు రాజ్యాంగ సంస్థలు, ప్రక్రియల గురించి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా దేశ అభ్యున్నతికి ఉపకరించే అవకాశాలను విశే్లషించుకోవాలి. ప్రభుత్వ, పరిపాలన వ్యవహారాల్లో భాగస్వాములై ఎంతో అద్భుతమైన, సంక్లిష్టమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజకీయ సంస్థలను మరింత బలోపేతంగా తీర్చిదిద్దడంతో పాటు అందరికీ ఉపకరించేలా సమాజంలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నా’ అని ప్రణబ్ పేర్కొన్నారు. సమాజం కల్పించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలిగే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో దేశానికి సహకరించాలని, తద్వారా దేశం గరిష్ఠ స్థాయిలో శక్తిసామర్ధ్యాలను సంతరించుకునేందుకు తోడ్పడాలని ఆయన న్యాయ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. నేషనల్ లా స్కూల్ స్నాతకోత్సవంలో ఓ విద్యార్థికి మెడల్‌ను అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్. చిత్రంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్, కర్నాటక గవర్నర్ వాజుభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య