జాతీయ వార్తలు

అరెస్టులు కొత్త కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 15: మీడియా లేదా సోషల్ మీడియాలో నాయకులకు వ్యతిరేకంగా వచ్చిన ఫొటోలు లేదా వార్తల కారణంగా అరెస్టులు జరగడం కొత్తమీ కాదు. బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ అరెస్టు ఇందుకు తాజా ఉదాహరణ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టిందని ఈమెపై అభియోగం. మమతకు వ్యతిరేకంగా ఒక కార్టూన్ వేసినందుకు ప్రొఫెసర్ అంబికేశ్ మహాపాత్ర జైలుపాలయ్యారు. ఆ కార్టూన్‌ను తన స్నేహితులకు సోషల్ మీడియాలో పంపడమే ఆయన చేసిన నేరం!. కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనను పోలీసులు అక్రమంగా నిర్బంధించి, దారుణంగా కొట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మహారాష్టల్రో ప్రముఖ కార్టూనిస్ట్ అసీమ్ త్రివేదిని 2012లో అరెస్టు చేశారు. జాతీయ చిహ్నం, పార్లమెంటు బొమ్మలను కళావిహీనంగా చిత్రించినట్టు ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు. జాతీయ చిహ్నంలో సింహాల స్థానంలో రక్తం మరిగిన తోడేళ్లను ఆయన చిత్రీకరించారు. పార్లమెంటు భవనాన్ని వెలుతురు సరిగా లేని రీతిలో వేశారు. ఈ కార్టూన్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. జాతీయభావాన్ని దెబ్బతీసే రీతిలో ఆయన పార్లమెంటు భవనాన్ని మరుగుదొడ్డి కుండీ మాదిరిగా వేసి అవమానించారంటూ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి త్రివేదిని అరెస్టు చేసింది. అదే ఏడాది శివసేన చీఫ్ బాల్‌థాకరే అంత్యక్రియల రోజున ముంబయిలో బంద్ వాతావరణ ఏర్పడింది. శివసేన కార్యకర్తలు ఒక్క దుకాణం కూడా తెరవకుండా అడ్డుకున్నారు. అయితే, షహీన్ దాడా, వేణు తమ క్లినిక్‌ను తెరిచే ఉంచారు. ఆ సమయంలో శివసేన కార్యకర్తలతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు వారిద్దర్నీ అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే, తీవ్ర ప్రతిఘటన వ్యక్తం కావడంతో అరెస్టు అయిన కొన్ని గంటల్లోనే వారికి బెయిల్ లభించింది. కాగా, బాల్‌థాకరే అంత్యక్రియల కోసం ముంబయిలో పూర్తి బంద్‌ను బలవంతంగా చేయించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించినందుకు షహీన్‌పై మరోసారి కేసులు నమోదయ్యాయి. శివసేన తీరును విమర్శించడమే ఆమె చేసిన తప్పు. తమిళనాడులో మద్యపాన వ్యతిరేక ఉద్యమకారుడు, జానపద కళాకారుడు శివ రాజ్ అలియాస్ కామ్రేడ్ కోవన్‌ను పోలీసులు 2015లో అరెస్టు చేశారు. మద్యపాన నిషేధం విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోవన్ తన పాటల్లో విమర్శించారని పోలీసులు కేసు పెట్టారు. తాజాగా మమతా బెనర్జీని విమర్శించినందుకు బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ జైలుపాలయ్యారు.
చిత్రం...కోల్‌కతాలో బుధవారం అరెస్టు అయిన బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ