జాతీయ వార్తలు

పారదర్శకత కోసమే పాకులాడుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం, పారదర్శకత కల్గించాల్సిన ఎన్నికల సంఘం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో శనివారం భారత ఎన్నికల విధానం, జవాబుదారీతనంపై జరిగిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్.బీ.లోకూర్, మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డిజిటల్ కరెన్సీ ద్వారా ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చునని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు జరిగిన అనంతరం డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టాలని తాము చేసిన సూచనలను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపోటములకన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తముకు ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని రోజులుగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రధాన మంత్రి అయినా.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా.. ఏ పార్టీ అయినా.. సమాన దృష్టిలోనే ఎన్నికల సంఘం చూడాలని, కాని ఆ విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలోనూ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈవీఎంలతోపాటు ఐదు నుంచి 10 వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్ష పార్టీలు, మేథావులు కోరుతున్నప్పటికీ ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించడం ఎన్నికల సంఘం బాధ్యత అని వెల్లడించారు. ఈసీ దృష్టిలో అన్ని పార్టీల నాయకులు సమానమని, కాని ఈసీ అలా వ్యవహరించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ ఖురేషీ మాట్లాడుతూ ఎన్నికల విధానంలో సాంకేతికతో మార్పులు తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని చెప్పారు. తాను సీఈసీకి ఉన్నత అధికారిగా ఉన్న సమయంలో చంద్రబాబు, లాలు ప్రసాద్ యాదవ్, చౌతాలా కలిశారని, వీవీప్యాట్లు తీసుకోరావాలని అప్పట్లో చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. చంద్రబాబు చేసిన సూచనలు తమకు కూడా ఆమోదయోగ్యంగా ఉన్నయని వివిధ పార్టీలు నాయకులు వెల్లడించారని చెప్పారు. తరువాత వీవీప్యాట్లపై ఈసీ నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తుచేశారు.

చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబు