జాతీయ వార్తలు

మోదీని ప్రజలే ఆశీర్వదిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, మే 19: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదించడానికి తాను ఎవరినని బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి వ్యాఖ్యానించారు. ప్రజలే ఆయనను ఆశీర్వదిస్తారని అన్నారు. వారణాసి నియోజకవర్గం నుంచి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 2009లో వారణాసి నుంచి లోక్‌సభకు ఎన్నికైన జోషి 2014లో మోదీ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. బీజేపీకి ఎంతో పట్టున్న ఈ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి గత ఎన్నికల్లో ఆయన కాన్పూర్ నియోజకవర్గానికి తరలివెళ్లారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి జోషికి టికెట్ లభించలేదు. మరో సీనియర్ నేత ఎల్.కే.అద్వానీ మాదిరిగానే జోషి కూడా దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆదివారం తన ఓటుహక్కును వినియోగించుకున్న ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘మోదీకి మీ ఆశీస్సులు ఉన్నాయి కదా’ అని ఒక విలేఖరి ప్రశ్నించినపుడు ఆయనను ఆశీర్వదించడానికి తాను ఎవరినని జోషి వ్యాఖ్యానించారు. ప్రజలే మోదీని ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందించిన జోషి 1999-2004 మధ్యకాలంలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రిగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాన్పూర్ నుంచి గెలుపొందారు. పార్లమెంటు ఎస్టిమేషన్స్ కమిటీ చీఫ్‌గా ఆయన వ్యవహరించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేకానేక నిర్ణయాల్లో ఈ కమిటీ సమర్పించిన పలు నివేదికలు కీలక పాత్రను పోషించాయి. ఇలావుంటే, ఈ ఏడాది ప్రారంభంలో ఒక ప్రకటన చేస్తూ, ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్న సమాచారం తనకు బీజేపీ నిర్వహణా కార్యదర్శి రామ్‌లాల్ ద్వారా తెలిసిందని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధిగా బీజేపీలో రామ్‌లాల్ చేరారు. అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కే.అద్వానీ మాదిరిగానే తనను కూడా ఏరోజైనా పక్కనపెట్టే ప్రమాదం ఉందని ఆయన అప్పట్లోనే అనుమానం వ్యక్తం చేశారు. ఈసారి ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం జోషి అనుమానాన్ని నిజం చేసింది.