జాతీయ వార్తలు

300 సీట్లు మావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, మే 19: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 300 సీట్లను తామే గెల్చుకుంటామని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి ఆదరణ లభించడంతో మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లో 29 స్థానాలకుగాను 22 సీట్లను గెల్చుకుంటామంటూ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన ప్రకటనను కైలాస్ తోసిపుచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత 22 రోజులైనా కమల్‌నాథ్ అధికారంలో ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ కలలు నెరవేరవని ఆయన అన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎలాంటి అరాచక పాలన కొనసాగుతోందో దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని కైలాస్ అన్నారు. అక్కడి ప్రభుత్వం పోలీసులు, గూండాలతో కలసి బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతూ విధ్వంసం సృష్టిస్తోందని ఆయన అరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గూండాలుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఈనెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అంతా తామే రాజకీయాలు నడిపిస్తామని వారిద్దరూ కలలు కంటున్నారని కైలాస్ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోగానే రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారని, అయితే, ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదని ఆయన అన్నారు. ఈ కారణంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రైతులు తమ తమ ఊర్లల్లోకి రానీయడం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో జరుగుతున్న వ్యతిరేకతను గమనించి ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రులను మార్చ డం అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు.