జాతీయ వార్తలు

అత్యధిక స్థాయిలో మోహరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభకు జరిగిన ఏడు విడతల పోలింగ్‌కు 3 లక్షల మంది పారామిలటరీ దళాలు, 20 లక్షల మంది పోలీస్ సిబ్బంది సేవలు అందించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు సోమవారంనాడు తెలిపారు. దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఈసారి పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను వినియోగించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 11న ప్రారంభమైన తొలి విడతతోపాటు మే 19న ముగిసిన ఏడవ విడత పోలింగ్ వరకు ఆయా బలగాల సేవలను వినియోగించుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల బందోబస్తు కోసం 3 వేల కంపెనీల పారామిలటరీ బలగాలు, 3 లక్షలకు పైగా పోలీసుల సేవలను దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపయోగించుకున్నారు. ఆయా రాష్ట్రాల ఆర్మ్‌డ్ పోలీసులు, ఇండియా రిజర్వు (ఐఆర్) బెటాలియన్స్, హోంగార్డుల సేవలకు తోడుగా దాదాపు 20 లక్షల మంది సేవలను ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించుకున్నట్టు ఆయా ట్రూపులను సంసిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఒక అధికారి తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఆయా పారామిటలరీ ట్రూపులను తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి భయం లేకుండా నిర్వహించేందుకు తద్వారా ప్రజల్లో భద్రత విషయంలో భరోసా ఇచ్చేందుకే ఈసారి ఎన్నడూ లేనంతగా సాయుధ సిబ్బందిని నియమించినట్టు ఆయన తెలిపారు. శాంతి భద్రతలు కాపాడడం, హింసాకాండలకు తావులేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు)ను కాపాడేందుకు పారామిలటరీ, పోలీస్ బలగాలను ఉపయోగించుకున్నామని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో వ్యవహరిస్తూ ఎన్నికలు సజావుగా సాగేందుకు సాయుధ దళాల సేవలను వినియోగించుకున్నామని పేర్కొన్నారు.