జాతీయ వార్తలు

‘యోజన’లో 9 ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది ప్రాజెక్టులను ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) మొదటి దశలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పిఎంకెఎస్‌వై పథకంపై ఆదివారం ఢిల్లీలో జరిగిన కేంద్ర జలవనరుల శాఖ సమన్వయ కమిటీ భేటీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను విలేఖరులకు తెలిపారు. గిరిజన, కొండ ప్రాంతాల్లో, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు 60 శాతం గ్రాంట్లను కేంద్రమే ఇవ్వాలని కమిటీ సిఫార్సులు చేసిందని అన్నారు. తెలంగాణలోని తొమ్మిది ప్రాజెక్టులు రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎస్సారెస్సి, ఇందిరా ఫ్లడ్ ఫ్లో కెనాల్, కొమరం బీం ప్రాజెక్టు, పెదవాగు, మత్తడివాగు, పాలెం వాగు, గొల్లవాగు, గాలివాగులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరామన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు 60 శాతం కేంద్ర నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. 2012 మార్చి 31నాటి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగినందున, ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులకు అదనంగా 25 శాతం డీపీఆర్ పరిగణనలోకి తీసుకోవాలని కమిటీలో చర్చించమన్నారు. పీఎంకేఎస్‌వై కింద తీసుకున్న మొదటి, రెండో దశ ప్రాజెక్టుల వివరాలను రాష్ట్రాలు ఈనెల 28 తేదీలోగా తెలపాలని కమిటి నిర్ణయించిదన్నారు. 2017 నాటికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు నాబార్డు నుండి రుణాలను ఇవ్వాలని కమిటీలో నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు. నాబార్డునుండి రాష్ట్రాలు 15 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల టెండర్ల విషయంలో పారదర్శకంగా వ్యవరించామన్న హరీశ్, అడ్డగోలుగా వ్యవరించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు మొబిలైజెషన్ పేరిట కాంగ్రెస్ రూ 1500 కోట్లు దోచుకోన్నారని దుయ్యబట్టారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టులో పారదర్శకంగా టెండర్లు నిర్వహించడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి 450 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.