జాతీయ వార్తలు

‘చౌకీదార్..ఖాకీ అండర్‌వేర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరులో కొన్ని పదాలు ఎక్కువగా వినిపించి ఓటర్లకు వినోదాన్ని పంచితే, మరోవైపు అగ్రనేతల వ్యక్తిగత ప్రతిష్టకు సైతం భగంకరంగా మారాయి. ఇందులో ప్రధానంగా ‘చౌకీదార్’, ‘భ్రష్టాచార్’, ‘ఔరంగజేబు’, ‘ముగాంబో’ వంటి పదాలు అధికంగా నేతల నుంచి వినిపించి ఆరోపణలు, ప్రత్యారోపణలకు నిలయంగా మారాయి. ఇది కేవలం ఒక పార్టీకి, లేదా ఒక రాజకీయవేత్తకు పరిమితం కాలేదు. అధిక శాతం నేతల నాలుక అదుపుతప్పి ప్రత్యర్థులను కించపరిచే స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు వెలువడ్డాయి. ప్రధాని చెప్పుకునే ‘వినమ్రత కలిగిన కాపలాదారు’ అనేపదాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన పార్టీ సహచర నేతలు ‘చౌకీదార్ చోర్ హై’ (ఈకాపలాదారు దొంగ) అంటూ వ్యాఖ్యానించి ఎద్దేవా చేశారు.
దీనిపై అత్యంత వేగంగా స్పందించిన బీజేపీ ‘మైబీ చౌకీదార్’ నినాదాన్ని పెద్దయెత్తున ప్రచారంలోకి తీసుకువచి కాంగ్రెస్‌కు సవాల్ విసిరింది. ఇక మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ముంబై దాడులను లక్ష్యంగా చేసుకుని దివంగత హేమంత్ కర్కరేపై చేసిన వ్యాఖ్యలు పెద్దయెత్తున ధుమారాన్ని రేపాయి, ఆయన తన శాపం కారణంగానే హతుడయ్యాడంటూ వ్యాఖ్యానించడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అలాగే మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను దేశభక్తుడుగా వ్యాఖ్యానించి మరో వివాదానికి తెరలేపారు. ఈ వివాదాల్లో సొంతపార్టీ నుంచి, ప్రదాన మంత్రి నుంచి సైతం వ్యతిరేకత తలెత్తడంతో చివరికి ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఇక సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్ ఆయన పార్టీ సహచరురాలు జయప్రద ఇటీవల బీజేపీలో చేరి రాంపూర్ నుంచి తనపైనే పోటీకి దిగడాన్ని సహించలేక ‘నేను ఆమెను రాంపూర్‌కు తెచ్చాను. 17 సంవత్సరాలుగా ఆమె ఎవరో ప్రజలకు తెలియదు. కానీ గడచిన 17 రోజుల్లో ఆమె ఖాకీ అండర్‌వేర్ ధరించిందని తెలుసుకున్నాన’ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ధుమారం రేపారు.
ఎన్నికల కమిషన్ అయన 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేదం విధించింది. అంతటితో ఆగకుండా అజంఖాన్ తనయుడు అబ్ధుల్లా ఆజం జయప్రదను ‘అనార్కలి’గా వ్యాఖ్యానించి వివాదం రేపారు. జయప్రద సైతం ప్రతిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఖాన్‌వి ‘ఎక్స్‌రే కళ్లు’ అని పేర్కొన్నారు. కాగా ప్రధాన మంత్రి మోదీ సైతం ఉత్తర్‌ప్రదేశ్ ర్యాలీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ’నీ తండ్రి పరిశుద్ధుడని చెప్పుకున్నా, ఆయన జీవితం అవినీతి పరుడిగానే ముగిసింద’ని రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే అనే బాలీవుడ్ హిట్ సినిమాల పేర్లు ‘కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, ఆంటీ నంబర్ 1’ వంటి మాటలు పలు దఫాల ప్రచారాల్లో మోదీ నోటి నుంచి వెలువడ్డాయి. మాయావతి సైతం ‘మోదీ తన భార్య జీవితాన్ని రాజకీయాలకు ఫణంగా పెట్టార’ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ సైతం మోదీని ఆధునిక ఔరంగజేబుగా వర్ణించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాట్లు దృశ్యం