జాతీయ వార్తలు

భారత్‌తోనే మండలికి ప్రతిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం ఉండాల్సిందేనని, లేనిపక్షంలో ఐరాస వ్యవస్థల ప్రతిష్ఠకు భంగకరమేనని భారత్‌లో జర్మనీ కొత్త రాయబారి వాల్టర్ జె లిండ్‌నర్ స్పష్టం చేశారు. భారత్‌లో జర్మనీ కొత్త రాయబారిగా నియమితులైన లిండ్‌నర్ మంగళవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి తన నియామక పత్రాలను అందజేశారు. ఈ పత్రాలు హిందీలో ఉండటం విశేషం. రాష్టప్రతిని కలిసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శాశ్వత సభ్యత్వాలతో భద్రతా మండలిని విస్తరించేందుకు జీ-4 దేశాలైన ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్ తీవ్రంగా కృషిచేస్తున్నాయని అన్నారు. 1.4 బిలియన్ జనాభా కలిగిన అతిపెద్ద భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం వినడానికే ఇబ్బందిగా ఉందని లిండ్‌నర్ అన్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ఐరాస వ్యవస్థల ప్రతిష్ఠకు భంగకరంగా పరిణమిస్తుందని అన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉందని ఆయన వెల్లడించారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు జర్మనీ మద్దతుగా నిలిచిందని అన్నారు. భారత్ సహా ఇతర దేశాలతో జర్మనీకి సత్సంబంధాలు ఉన్నాయని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని లిండ్‌నర్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమేరకు ఉన్నాయని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనన్నారు. ‘్భరత్ ఓ అద్భుతమైన దేశం. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా జర్మనీ తన సత్సంబంధాలను కొనసాగిస్తుంది. అయినా మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయి కదా’ అని బదులిచ్చారు.
యూరప్ దేశాల అనుభవాల మేరకు ఈవీఎంలు మంచివా లేక బ్యాలెట్ పేపర్లు మంచివా అని అడిగిన ప్రశ్నకు - ‘మనం ఏ వ్యవస్థని ఎంచుకున్నా అది మంచిదనే అనుకోవాలి’ అని బదులిచ్చారు. ఇరాన్‌పై అమెరికా అంక్షలకు సంబంధించి లిండ్‌నర్ మాట్లాడుతూ ఇరాన్‌తో అణు ఒప్పందానికి జర్మనీ పూర్తి మద్దతు పలుకుతుందని, ఆ ఒప్పందం వల్ల అణ్వాయుధ రహిత దేశంగా నిలుస్తుందని అన్నారు.