జాతీయ వార్తలు

బీజేపీది పగటికలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలాల్‌బర్గీ (కర్నాటక) మే, 21: లోక్‌సభ ఫలితాల అనంతరం కర్నాటకలో తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ చేస్తున్న ప్రకటనలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే తిరస్కరించారు. అలాగే ఎన్నికల అనంతరం 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారంటూ బీజేపీ రాష్ట్ర సారథి యెడ్యూరప్ప చేస్తున్న ప్రకటనలను కూడా ఆయన కొట్టి పారేస్తారు. కలలుగనడమే బీజేపీ పని అని పేర్కొన్న ఖర్గే గతంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలు బీజేపీకి అప్పగించారని, అయినా అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్‌లో 20 మంది ఎమ్మెల్యేలు నిరాశా, నిస్పృహలతో ఉన్నారని వీరందరూ కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ యెడ్యూరప్ప గత కొంత కాలంగా చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఖర్గే మాట్లాడారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ రకమైన ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడింది. అయితే, కర్నాటకలో తమ ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ముప్పూలేదని పేర్కొన్న ఖర్గే.. అధికార కూటమిలో ఐక్యతకు ఢోకా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరూ ఎన్నికలను కోరుకోవడం లేదని, అలాగే అధికార కూటమి సుస్థిరతకు ముప్పులేదని ఆయన విస్పష్టంగా తెలిపారు.