జాతీయ వార్తలు

తేడా వస్తే.. ఫుల్‌కౌంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట ఐదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్లను ఈవీఎంల ఓట్లతో ధ్రువీకరించే ప్రక్రియ నిర్వహించిన తరువాతనే మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలి.. వీవీ ప్యాట్ల ధ్రువీకరణలో ఏమాత్రం తేడా కనిపించినా ఆ అసెంబ్లీ సిగ్మెంట్‌లోని మొత్తం ఓట్లను వీవీప్యాట్లతో సరిపోల్చాలని ప్రతిపక్షానికి చెందిన 22 పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ డిమాండ్‌ను అక్కడికక్కడే తిరస్కరించినట్లు తెలిసింది. ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎన్నికల సంఘం రేపు సమావేశమై తమ డిమాండ్‌పై ఒక నిర్ణయం తీసుకుంటుంది.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తమకు హామీ ఇచ్చిందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈవీఎంలను రిగ్‌ చేసే ప్రమాదం ఉన్నదని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈవీఎంలను ప్రైవేట్ వాహనాల్లో రవాణా చేయటం వెనక ఉన్న రహస్యం ఏమిటని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాయి. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాలు, డీఎంకే, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ, జనతాదళ్ (ఎస్) తదితర ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీల నాయకులు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. వీవీప్యాట్ల ధ్రువీకరణ మొదట చెప్పాలని డిమాండ్ చేయటంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈవీఎంలలోని ఓట్లను తారుమారు చేసే ప్రమాదం ఉన్నందున వాటి రక్షణకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. చంద్రబాబు నాయుడు, గులాం నబీ ఆజాద్, రాంగోపాల్ యాదవ్, అహ్మద్ పటేల్, సీతారాం ఏచూరి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డెరిక్ ఓబ్రెయిన్, అరవింద్ కేజ్రీవాల్, అభిషేక్ సింఘ్వి తదితరులు మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఓటర్ల విశ్వాసం కాపాడేందుకు, పారదర్శకతను పాటించేందుకు మొదట వీవీప్యాట్లను ధ్రువీకరించే కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రక్త పరీక్షలో ఒక చుక్క రక్తాన్ని మాత్రమే పరీక్షిస్తారంటూ గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యను ఊటంకిస్తూ చుక్క రక్తం మొత్తం శరీరం చెడిపోయినట్లు చూపిస్తోంది కాబట్టి మొత్తం శరీరాన్ని స్కాన్ చేయవలసి అవసరం వచ్చింది.. ‘హోల్ బాడీ స్కాన్’ జరగాలని ఆయన ఆవేశంతో డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ డిమాండ్‌ను ఎందుకు ఒప్పుకోవటం లేదని ఆయన నిలదీశారు. ప్రజల తీర్పును బీజేపీ తారుమారు చేయకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. తప్పులు జరిగినట్లు సాక్ష్యం ముందుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోరా? అని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. వేలుకు క్యాన్సర్ సోకితే మొత్తం వేలును కత్తిరించవలసి ఉంటుందన్నారు. ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా బీజేపీకి ఓటు పడుతోంది.. దీనిని సరిదిద్దాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. వీవీప్యాట్ల ధ్రువీకరణ మొత్తం ఓట్ల లెక్కింపు తరువాత చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను తాము తిరస్కరించామని ఆజాద్ తెలిపారు. మొదట ఐదు పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్లను ఈవీఎం ఓట్లతో ధ్రువీకరించుకున్న తరువాతే మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నది తమ డిమాండ్ అని ఆజాద్ తెలిపారు. పోలైన ఓట్ల విషయంలో ఈవీఎం కంట్రోల్ యూనిట్‌కు ఫామ్ 17సి మధ్య తేడా కనిపించే పక్షంలో ఈ తప్పును సరిదిద్దేందుకు అనుసరించే విధానం ఏమిటని ప్రతిపక్షం నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. 13.2 చట్టం ప్రకారం ఏమిటనేది స్పష్టం చేయాలని ప్రతిపక్షం అడిగింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్ యంత్రాలు పని చేయకపోతే క్లాజ్ 12 ప్రకారం చర్య తీసుకోవాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలన్నారు. సరిగా పని చేయని కంట్రోల్ యూనిట్లకు ఆగ్జిలరీ డిస్లే అనుసంధానం చేసి ఫలితాలు తీసుకోవటం నిలిపివేస్తామంటే అర్థం ఏమిటని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత అన్ని కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల పేపర్ స్లిప్పులను లెక్కించాలన్న 12.1 నియమం ఏమిటని కూడా ప్రతిపక్షం నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఈవీఎంల ఓట్ల రీకౌంటింగ్‌కు సంబంధించిన 16.1 క్లాజ్‌ను తొలగించాలని ప్రతిపక్షం కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది.
ఇదిలాఉంటే 22 ప్రతిపక్ష పార్టీల నాయకులు మొదట కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమై సమాలోచనలు జరిపారు. తరువాత అక్కడినుండి ఊరేగింపుగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు.
చిత్రం... సీఈసీతో సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న విపక్ష పార్టీల నేతలు