జాతీయ వార్తలు

నిర్దిష్ట కాలపరిమితిలో పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నదని కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని అరికట్టేందుకు అవసరమైతే రివర్స్ టెండరింగ్ చేస్తామని వెల్లడించారు. రివర్స్ టెండర్లు ఇవ్వవలసి వస్తే పోలవరం ప్రాజెక్టు పనులను ఒక నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలనే షరతు విధిస్తామని ఆయన చెప్పారు. అవసరం, అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారానే పోలవరం రివర్స్ టెండరింగ్ చేయిస్తామని జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు కావలసింది పోలవరం ప్రాజెక్టు ఒక నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయటమేనని ఆయన ప్రకటించారు.