జాతీయ వార్తలు

దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయబరేలీ, మే 26: భారత దేశ వౌలిక విలువల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా తాను సిద్ధంగా ఉన్నానని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. తనను మళ్లీ ఎన్నుకున్నందుకు రాయబరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె ఓ లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో తనపై ఎవరినీ పోటీకి నిలబెట్టనందుకు సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీలకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు దేశ వౌలిక విలువల పరిరక్షణకు అవసరమైతే ఎంతటి త్యాగానికైనా తాను వెనుకాడనని సోనియా వెల్లడించారు. రానున్న రోజులు అత్యంత కఠినంగా ఉంటాయన్న విషయం తనకు తెలుసునని వెల్లడించిన సోనియా ‘మీ మద్దతు, మీరు కనబరిచిన విశ్వాసం, అందించిన శక్తితో కాంగ్రెస్ పార్టీ ఈ సవాళ్ళను దీటుగా ఎదుర్కొగలుగుతుంది’ అని తెలిపారు. గతంలో ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా రాయబరేలీ ప్రజలు తన పట్ల ఎనలేని నమ్మకాన్ని కనబరిచారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సోనియా తెలిపారు. ‘నా జీవితం తెరిచిన పుస్తకం, అది మీ కళ్ళ ముందే ఉంది, మీరే నా కుటుంబం, మీరే నా శక్తి, సంపద’ అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలీ నియోజకవర్గం నుంచి తన సమీప బీజేపీ అభ్యర్థిపై లక్షా 67 వేల ఓట్లతో సోనియా గాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.