జాతీయ వార్తలు

ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని టీకంగడ్ బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ పదిహేడవ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 17వ తేదీ ఉదయం రాష్టప్రతి భవన్‌లో లోక్‌సభకు ఎనిమిదిసార్లు ఎంపికైన వీరేంద్ర కుమార్‌కు చేత ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలిసింది. ప్రోటెం స్పీకర్‌గా 17, 18 తేదీల్లో కొత్త సభ్యుల చేత సభ్యత్వ ప్రమాణం చేయించటంతోపాటు 19న స్పీకర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు. సమావేశాలు 17 నుండి ప్రారంభవుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభ మాత్రం మూడు రోజులు ఆలస్యంగా ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగా పని చేసిన వీరేంద్ర కుమార్ మొదటిసారి 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన వరుసగా 12, 13, 14, 15, 16, 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కార్మిక, సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ అధ్యక్ష పదవితోపాటు పలు ఇతర కమిటీల అధ్యక్ష పదవులు, 2017-19 మధ్యకాలంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన వీరేంద్ర కుమార్‌కు బాల్యం నుండి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975లో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు వీరేంద్ర కుమార్ పదహారు నెలలపాటు జైలు జీవితం గడిపారు. కటిక వర్గానికి చెందిన ఆయన చిన్నప్పుడు తన తండ్రి సైకిల్ మరమ్మత్తుల దుకాణంలో పని చేసేవాడు. వీరేంద్ర కుమార్ తండ్రి అమర్‌సింగ్ జనసంఘ్ నాయకుడు కావడంతో ఆయన బాల్యం నుండి ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. తదనంతరం ఆయన జనసంఘ్, బీజేపీ నాయకుడిగా ఎదిగారు.