జాతీయ వార్తలు

ఇక కొత్త కార్మిక చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: పెట్టుబడిదారులకు సహకరించడం, వృద్ధిని వేగవంతం చేయడమనే లక్ష్యాలను సాధించడానికి గాను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కొత్త కార్మిక చట్టాన్ని తేవడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 44 కార్మిక చట్టాలను కలిపి వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత- సంక్షేమం, పారిశ్రామిక సంబంధాలు అనే నాలుగు విభాగాల కింద ఒకే చట్టంగా తయారు చేస్తుంది. కేంద్ర హోమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్, వాణిజ్య, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంట సేపు సాగిన సమావేశానంతరం మంగళవారం గంగ్వార్ విలేఖరులతో మాట్లాడుతూ ‘వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఒక కొత్త కార్మిక బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది’ అని తెలిపారు. కొత్త కార్మిక బిల్లు ముసాయిదాను కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతామని, తరువాత దానిని లోక్‌సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల రెండో వారంలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ బిల్లు కోసం ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రధాన కార్మిక సంఘాలను సంప్రదించిందని ఆయన చెప్పారు.