జాతీయ వార్తలు

బెంగాల్‌లో ఆగని అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యారెక్‌పొర్: పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంకినార ప్రాంతంలో బాంబు పేలుడుతో మహ్మద్ ముఖ్తార్, మహ్మద్ హలీం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు చెప్పారు. మరణించిన వారు, తీవ్రంగా గాయపడిన వారు తమ పార్టీ సానుభూతిపరులని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ కిరాయి దుండగులు వేధిస్తున్నారని టీఎంసీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయలేదన్న కక్ష్యతో దాడులకు దిగారని ఆరోపించారు. ఇలాఉండగా బ్యారెక్‌పొర్ నియోజకవర్గం బీజేపీ లోక్‌సభ సభ్యుడు అర్జున్ సింగ్ ఈ ఆరోపణను తీవ్రంగా ఖండించారు. కుటుంబ తగాదాల కారణంగా దాడులు జరిగాయని, రాజకీయాలకు ముడి పెట్టవద్దన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించామని రాష్ట్ర శాంతి-్భద్రతల అదనపు డిజి జ్ఞాన్‌వంత్ సింగ్ తెలిపారు. జరిగిన ఘటనపై సంపూర్ణ సమాచారం సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలాఉండగా సోమవారం హౌరా జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగారని బీజేపీ ప్రత్యారోపణ చేసింది.
హింస విచారకరం: మమత
కోల్‌కత్తా: లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండలో మరణించిన 10 మందిలో 8 మంది తమ పార్టీ సానుభూతిపరులేనని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని మంగళవారం ఆమె ఆవిష్కరించారు. గత నెలలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన రోడ్-షో సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు సృష్టించిన బీభత్సంలో విద్యాసాగర్ విగ్రహం విధ్యంసమైందని ఆమె ఆరోపించారు. అదేవిధంగా ఆమె హరె పాఠశాల సమీపంలో 8.5 అడుగుల ఎతె్తైన విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి చుట్టూ ఫైబర్ గ్లాస్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమత ప్రసంగిస్తూ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత సృష్టించిన హింసా కాండలో తమ పార్టీ కార్యకర్తలు 8 మంది మరణించారని, మరో ఇద్దరు బీజేపీ సానుభూతిపరులు ఉన్నారని తెలిపారు. మరణించింది ఎవరైనా ప్రతి ఒక్కరి మరణం దురదృష్టకరం, బాధాకరమని ఆమె అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహా యం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తానని ఆమె చెప్పా రు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ సీట్లలో 18 సీట్లను బీజేపీ కైవసం చేసుకున్న తర్వాత హింసాకాండ పెరిగిందని ఆరోపించారు.

చిత్రం...బెంగాలీ సంస్కర్త ఈశ్వర్ బాయ్ విద్యాసాగర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో
ధ్వంసమైన ఈ విగ్రహాన్ని కోల్‌కతాలో పునఃప్రతిష్ఠించారు.