జాతీయ వార్తలు

పాట్నాలో.. చారిత్రాత్మక కట్టడం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 16: బీహార్ రాజధాని పాట్నాలో ఓ వందేళ్ళ చారిత్రక కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. ఇది స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిర్మాణం కోసమేనని అధికారులు చల్లగా సెలవిచ్చారు. వందేళ్ళ క్రితం పాట్నాలో మొట్టమొదటి మార్కెట్ నిర్మాణం జరిగింది. ఇది గోల్ మార్కెట్‌గా పేరొందింది. కాగా శుక్రవారం ప్రారంభమైన కూల్చి వేతలు ఆదివారం కూడా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న కట్టడాలనూ కూల్చి వేస్తున్నట్లు పాట్నా మున్సిపల్ కమిషనర్ అనుపమ్ కుమార్ సుమన్ తెలిపారు. ఇందులో భాగంగానే గోల్ మార్కెట్‌నూ కూల్చి వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో ఏడంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నామని, అందులోనే ఆధునిక పద్ధతుల్లో మున్సిపల్ మార్కెట్ కూడా ఏర్పాటవుతుందని ఆయన వివరించారు. ఇలాఉండగా గత ఏడాది డిసెంబర్‌లో 133 ఏళ్ళ అంజుమన్ ఇస్లామియా హాలును కూడా మున్సిపల్ అధికారులు కూల్చి వేయించారు.
పాట్నాలో మొదటి పబ్లిక్ హాలును కూల్చి వేయించి అక్కడ ఆధునిక కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇలాఉండగా పేరొందిన గోల్ మార్కెట్‌ను కూల్చి వేయడం పట్ల 84 ఏళ్ళ ఆర్కిటెక్ట్, ఇన్‌టాక్ పాట్నా చాఫ్టర్ కన్వీనర్ జెకె లాల్ ఆందోళన వ్యక్తం చేశారు. చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చిత్రం... మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ప్రాంతంలో పోలీసుల పహారా