జాతీయ వార్తలు

తెలుగులో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న వ్యక్తి కిషన్‌రెడ్డి మాత్రమే. తెలుగులో దైవసాక్షిగా అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కిషన్‌రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు మంగళవారం లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17వ లోక్‌సభ మొదటి రోజు తెలంగాణ నుంచి ఎన్నికైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లీస్ సభ్యులు పార్లమెంట్‌కు హాజరయ్యారు.