జాతీయ వార్తలు

అది దుస్సాహసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 18: ఇంద్రజాలికుడు చంచల్ లహరి (40) చేసిన సాహస యత్నం దుస్సాహసమేనని ప్రముఖ ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ (జూనియర్) వ్యాఖ్యానించారు. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా లహరి పిచ్చి సాహసాన్ని చేశారని ఆయన విమర్శించారు. కళ్ళకు కట్టిన గంతలను, కాళ్ళకు-చేతులకు వేసిన బంధాలను తెంచుకుని ఎలా బయటపడాలో సరైన శిక్షణ పొందకుండా లహరి సాహసం చేసి చివరకు తన ప్రాణాలపైకి తెచ్చుకున్నాడని పీసీ సర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కళ్ళకు గంతలు కట్టుకుని, కాళ్ళు-చేతులు కట్టేసుకుని ఓ ఇనుప బోను (పంజరం)లో కూర్చుని హుగ్లీ నదిలోకి దిగిన పేరెన్నికగన్న ఇంద్రజాలికుడు చంచల్ లహరి (40) గల్లంతయ్యాడు. దక్షిణ కోల్‌కత్తాకు చెందిన లహరి 2013 సంవత్సరంలోనూ సాహస యత్నం చేసి విజయవంతంగా తిరిగి వచ్చాడు. కానీ ఈ సారి లహరిని దురదృష్టం వెంటాడింది. పోలీసులతో పాటు విపత్తు సహాయ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టడంతో హౌరాకు సమీపంలోని రామకృష్ణపూర్ ఘాట్ వద్ద ఇంద్రజాలికుడు లహిరి శవం లభించింది. లహరి తన సాహస యత్నానికి పోలీసులు, పోర్టు ట్రస్టు అధికారుల నుంచి అనుమతి పొందారు. హుగ్లీ నదిలోకి పంజరాన్ని దించిన తర్వాత లహరి తన బంధనాలను తెంచుకుని బయటకు రావాలి కానీ 10 నిమిషాలైనా బయటకు రాకపోవడంతో ప్రేక్షకులు ఆందోళన చెందారు. దీంతో ఒక ప్రేక్షకుడు విపత్తు సహాయ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పడంతో, పోలీసులు, విపత్తు సిబ్బంది, గజ ఈతగాళ్ళు హుగ్లీ నదిలో గాలింపు చర్యలు చేపట్టడంతో సోమవారం సాయంత్రం లహరి శవం కనిపించింది. వందేళ్ళ క్రితం అమెరికాకు చెందిన ఇంద్రజాలికుడు హ్యూరీ హౌడీ ఈ సాహస యత్నం చేసి ప్రఖ్యాతి పొందాడు. ఆ తర్వాత పలువురు మెజిషీయన్లు ఇటువంటి సాహస యత్నాలు చేసి విజయవంతంగా తిరిగి వచ్చారు. లహరి కూడా తన బంధనాలను తెంచుకుని వస్తాడని అందరూ ఊహించారు. కానీ దురదృష్టం ఆయన్ను వెంటాడింది. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులు లహరి గల్లంతై శవమై తేలడంతో కన్నీటీపర్యంతమయ్యారు.