జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 18: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు మృతి చెందారు. పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడితో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాది కూడా ఇందులో ఉన్నాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీకి చెందిన ఒక జవాను వీరమరణం పొందాడు. భద్రతా బలగాలు మంగళవారం ఉదయం బిజ్‌బెహార ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో భద్రతా దళాలపైకి మిలిటెంట్లు కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. మిలిటెంట్ల కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను మృతి చెందాడని ఆర్మీ అధికారి ఒకరు వివరించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. ‘బిజ్‌బెహారలో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని సజ్జాద్ భట్, తౌసీఫ్ భట్‌గా గుర్తించారు. వారిద్దరు కూడా జేఈఎం ఉగ్రవాద సంస్థకు చెందిన వారు’ అని ఆ అధికారి వివరించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలోని లెత్‌పొర ప్రాంతంలో ఒక జేఈఎం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటనతో సంబంధం ఉన్న సజ్జాద్ భట్ పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ మేజర్ వీరమరణం పొందగా, ఒక మిలిటెంట్ హతమయ్యాడు. మరో అధికారి, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అదే రోజు పుల్వామాలో ఉగ్రవాదులు ఒక వాహనంలో అమర్చిన శక్తివంతమయిన పేలుడు పరికరం (ఐఈడీ) పేలి తొమ్మిది మంది ఆర్మీ సిబ్బంది, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. గాయపడిన ఆర్మీ సిబ్బందిలో ఇద్దరు జవాన్లు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు.
కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మేజర్ కేతన్ శర్మ భౌతిక కాయం వద్ద చిత్రం...విలపిస్తున్న ఆయన భార్య, సోదరి