జాతీయ వార్తలు

కాంగ్రెస్ లోక్‌సభా పక్షం నేతగా అధీర్ రంజన్ చౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడి పదవి చేపట్టేందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించటంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ నాయకుడు, బెరహాంపూర్ లోక్‌సభ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరికి ఆ పదవి దక్కింది. అధీర్ రంజన్ చౌదరిని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడిగా నియమిస్తున్నట్లు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ లోక్‌సభ కార్యాలయానికి మంగళవారం లేఖ రాశారు. సోనియాగాంధీ పార్టీ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులం నబీ ఆజాద్, ఇతర సీనియర్ నాయకులతో సమావేశమై లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడి నియామకం గురించి చర్చించారు. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకత్వాన్ని చేపట్టాలని రాహుల్‌కు సోనియా విజ్ఞప్తి చేశారు. ఇతర సీనియర్ నాయకులు కూడా రాహుల్‌ను పదే పదే కోరారు. రాహుల్ మాత్రం తానికమీదట కాంగ్రెస్‌లో ఎలాంటి పదవులు చేపట్టనని స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్న తాను లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడిగా ఎలా కొనసాగుతానని రాహుల్ ప్రశ్నించినట్లు తెలిసింది. దీనితో లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకత్వాన్ని అధీర్ రంజన్ చౌదరికి అప్పగించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌కు వీలున్నంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్ మరోసారి పార్టీ సీనియర్ నాయకులకు చెప్పినట్లు తెలిసింది. పార్టీలో ఎలాంటి పదవులు నిర్వహించకూడదన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని కూడా మరోసారి చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు వారం రోజులపాటు లండన్‌లో గడిపిన రాహుల్ గాంధీ సోమవారం స్వదేశానికి వచ్చి లోక్‌సభలో వాయనాడ్ ఎంపీగా సభ్యత్వ ప్రమాణం స్వీకారం చేయటం తెలిసిందే.

చిత్రం...అధీర్ రంజన్ చౌదరి