జాతీయ వార్తలు

చర్చించుకున్నాకే చెబుతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరుకావాలా? వద్దా? అన్న దానిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏకకాల ఎన్నికలను వ్యతిరేకిస్తున్న ఈ పార్టీలు ఇందుకు సంబంధించి అంతర్గతంగా చర్చించుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇందుకు సంబంధించి మంగళవారం సమావేశమైన యూపీఏ భాగస్వామ్యపక్షాలు విస్తృతంగా చర్చించాయి. భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలతో సంప్రదించిన తర్వాతే మోదీ ఏర్పాటు చేసే సమావేశంపై నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాన్ని అందించాయి. ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారా? అన్న ప్రశ్నకు ‘ఈ విషయం బుధవారమే తెలుస్తుంది’ అని యుపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ జవాబిచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం ఈ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వకుండా దాట వేశారు. లోక్‌సభ, రాజ్యసభలో కనీసం ఒక్క సభ్యుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా బుధవారం తాను నిర్వహించే సమావేశానికి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. కాగా మంగళవారం జరిగిన యూపీఏ సమావేశానికి సోనియా, రాహుల్‌తో పాటు సీపీఐ నేత డీ. రాజా, ఆర్‌ఎస్‌పి నాయకుడు ప్రేంచందర్, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు, కనివౌళి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. మోదీ పిలిచినంత మాత్రాన ఈ అఖిలపక్ష భేటీకి హాజరుకావడం అన్నది తొందరపాటే అవుతుందని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఒకే జాతి, ఒకే ఎన్నిక అన్న విస్తృత ప్రాధాన్యత గల అంశంపై అతి తక్కువ వ్యవధిలో నిర్ణయం చెప్పడం సాధ్యం కాదని, దీనిపై విస్తృతంగా చర్చించిన తర్వాతే ఓ అభిప్రాయానికి రాగలుగుతామని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. పైగా ఇంత తక్కువ వ్యవథిలో తమ అభిప్రాయాలు చెప్పడం కూడా సాధ్యం కాదన్న భావనే అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది.