జాతీయ వార్తలు

అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ గైర్హాజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరిపే విషయంపై బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ గైర్హాజర్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అనే అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది.
దీనికి కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా గైర్హాజరయ్యాయి. సమాజవాది పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), డీఎంకే, తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం విశేషం. అయితే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా తమ తమ పార్టీల తరఫున సమావేశానికి హాజరై, ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఫెడరల్ విధానానికి ఇది గొడ్డలిపెట్టు వంటిదని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సమావేశం
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 49వ జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకున్న కాంగ్రెస్, ఆ తర్వాత వివిధ పార్టీలతో సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఒకవేళ ఈ సమావేశం ఈవీఎంలకు సంబంధించినది అయితే తాను హాజరై ఉండేదానినని బీఎస్పీ నేత మాయావతి ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. అయితే, ఆ పార్టీ తరఫున రాఘవ్ చద్దా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకాగా, ఈ సమావేశానికి హాజరు కావాలన్న కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. ఇలావుంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కాంగ్రెస్ సహా పలు విపక్షాల నేతలు విమర్శించారు.
అటు లోక్‌సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీయడమేనని అన్నారు. భారతదేశాన్ని పాక్షిక ఫెడరల్, పాక్షిక యూనిటరీ దేశంగా రాజ్యాంగం అభివర్ణించిందని, ఆ విధానంలోనే ఎన్నికల ప్రక్రియ జరగాలని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపించాలన్న పట్టుదలతో ఉంది.

చిత్రం...ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన 49వ జన్మదినోత్సవం సందర్భంగా
అభినందిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్.