జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన అంబికా కృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సోమవారం అంబికా కృష్ణకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యేగా గతంలో పని చేసిన ఆయన ప్రస్తుతం ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకంతో బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. ఏపీలో అనేక మంది తెలుగుదేశం నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ పార్టీలో పెద్ద పదవులు అనుభవించ లేదని.. 20 ఏళ్లుగా పార్టీకి అన్ని విధాలుగా సేవలు చేశానని అన్నారు. కాని తనకు తగిన గుర్తింపు రాలేదని అంబికా కృష్ణ వాపోయారు.