జాతీయ వార్తలు

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా కల్పించాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు నామా నాగేశ్వరావు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై లోక్‌సభలో నామా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిందని.. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం కూడా సహాయం చేయాలని కోరారు. ప్రపంచలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సివుందని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు కేంద్రం సహాయం చేయడం వల్ల రాష్ట్భ్రావృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్ర, ఏపీల మధ్య ప్రాజెక్టుల విషయంలో జల జగడాలు జరిగాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చంద్రశేఖర్‌రావు సేహ్నపూర్వకంగా ఉంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు మూలంగా తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, పరిశ్రమల నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్లమెంటులో చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పెండింగ్ అంశాలను కూడా త్వరగా అమలు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు పర్యవరణ అనుమతులను మంజురు చేసిన కేంద్రానికి ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతుల క్షేమంకోసం రైతుబంధు పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులకు టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని.. రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా అదుకోవాలని నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.