జాతీయ వార్తలు

బీజేపీలో చేరుతున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తాను బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. నరేంద్ర మోదీ రాజ్యసభ నుండి సెంట్రల్ హాల్ మీదుగా లోక్‌సభకు వెళుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఆయనను కలిశారు. నరేంద్ర మోదీతోపాటు ముందుకు నడుస్తూ తాను శాసనసభ్యుడననీ.. త్వరలోనే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. నరేంద్ర మోదీ స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి భుజం చరిచి ఆమోదం తెలుపుతూ ముందుకు సాగిపోయారు.