జాతీయ వార్తలు

ట్రిలియన్ డాలర్ల వార్షికాదాయ రాష్ట్రం ఒడిశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూలై 10: మూడు ట్రిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని పొందగలిగే అవకాశాలు ఒడిషా రాష్ట్రానికి ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం నాడిక్కడ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విజన్‌కు రూపకల్పన జరిగిందని తెలిపారు. ‘ఎకనామిక్ పాజిబులిటీస్ ఫర్ ఒడిషా టువోర్డ్స్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ’ పేరిట రూపొందించిన ఈ విజన్ నివేదికను ‘జేఎస్‌డబ్ల్యు గ్రూప్’, ‘పీడబ్ల్యూసీ ఇండియా’ సంయుక్తంగా రూపొందించాయని పట్నాయక్ చెప్పారు. రాష్ట్రంలో భారీగా సహజ వనరులున్నాయని, వీటిని వినియోగించి స్నేహపూర్వక పెట్టుబడుల విధానంతో లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించామని, అలాగే స్థానికంగా వౌలిక వసతులను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించుకుంటామని ఆయన వివరించారు. జాతీయ ఆర్థికాభివృద్ధిని సైతం దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామన్నారు. ప్రత్యేకించి తయారీ రంగాన్ని ఓ హబ్‌లా అభివృద్ధి చేసే లక్ష్యం ఉందన్నారు. గడచిన మూడు దశాబ్ధాల్లో మూడు సార్లు మాత్రమే అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి జరిగిందని ఇందుకు రెట్ల అభివృద్ధి 2050 నాటికి చోటుచేసుకుంటుందని ఈ విజన్ నివేదిక అంచనా వేసింది. రాష్ట్రంలో ఖనిజాల ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రా ధాన్యతనిస్తామని, అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, మహిళా ఔత్సాహికులను ప్రోత్సహించి వారికి భాగస్వామ్యం కల్పించాలని విజన్ నివేదిక సూచిందని సీఎం పట్నాయక్ తెలిపారు.