జాతీయ వార్తలు

గవర్నర్ హౌస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూలై 10: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ జమ్మూకాశ్మీర్ శాఖ నేతలు గవర్నర్ హౌస్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. రాజ్యాంగంలోని 35ఏ, 370 అధికరణలపై బీజేపీ తప్పుడు హామీలు ఇస్తున్నదని కాంగ్రెస్ జమ్మూ జిల్లా శాఖ అధ్యక్షుడు విక్రమ్ మల్హోత్రా ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి, నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణను చేపడతారా? లేదా? అనేది తేల్చి చెప్పాలని బీజేపీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉందని మల్హోత్రా అన్నారు. 370 అధికరణను ఎలాంటి మార్పులు చేర్పులూ లేకుండా యథాతథంగా అమలు చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు. తప్పుడు హామీలు, ప్రచారాలతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారిస్తున్న తీరుకు జమ్మూ కాశ్మీర్‌లోనే కాక, దేశ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి.