జాతీయ వార్తలు

బీజేపీకి టచ్‌లో 107 ఎమ్మెల్యేలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా, జూలై 13: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారితో సహా 107 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ శనివారం నాడిక్కడ వెల్లడించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే చేరబోతారని అన్నారు. ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారేనని ఆయన వెల్లడించారు. మమత బెనర్జీకి చెందిన ప్రభుత్వంపై ఆ పార్టీ నేతల్లో చాలా మందికి విశ్వాసం పోయిందని ఆమె పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ముకుల్ రాయ్ అన్నారు. ఈ 107 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్, సీపీఎం సభ్యులు కూడా ఉన్నారని త్వరలోనే బీజేపీలో చేరిపోవాలన్న ఆసక్తిని కనబరిచారని ఆయన చెప్పారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 18 సీట్లను బీజేపీ గెలుపొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, సీపీఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను తృణమూల్ కాంగ్రెస్ నియమించుకోవడాన్ని ముకుల్ రాయ్ ఎద్దెవా చేశారు. దీనిని బట్టి చూస్తేనే మమతా బెనర్జీ జనాకర్షక శక్తి పట్ల పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిందన్న విషయం స్పష్టమవుతుందన్నారు.