జాతీయ వార్తలు

జాబిలమ్మ యాత్రకు సడన్ బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 15: అన్ని అనుకున్నట్లుగానే జాబిలమ్మ యాత్రకు ఇస్రో శాస్తవ్రేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓ పక్క భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఒకరోజు ముందే ఆదివారం షార్‌కు చేరుకున్నారు. ప్రయోగ వేదిక ఉన్న చంద్రయాన్-2 మిషన్‌ను కూడా తిలకించారు. ఎంఆర్‌ఆర్ సమావేశం, లాంచింగ్ బోర్డు సమావేశంలో కూడా శాస్తవ్రేత్తలు రాకెట్ ట్రయల్, రిహార్సల్, ప్రీ కౌంట్‌డౌన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించి ప్రయోగానికి సంసిద్థత ఇచ్చారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును పలుసార్లు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. అన్ని సరిగ్గా ఉండడడంతో ప్రయోగ కౌంట్‌డౌన్‌ను ఆదివారం ఉదయం 6:51గంటలకు ప్రారంభించారు. 19గంటల పాటు
కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగింది. షార్‌కు వీఐపీలతో పాటు నేషనల్, బెంగళూరు, ఢిల్లీ, చైన్నై,తిరుపతి నుంచి కాకుండా లోకల్ మీడియా వారు షార్‌కు చేరుకుని కౌంట్‌డౌన్‌ను మీడియా సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. మరో 56 నిమిషాల్లో చంద్రయాన్-2 మిషన్ నింగిలోకి పయనమవుతుందన్న తరుణంలో ఒకసారిగా మీడియా సెంటర్‌లో స్క్రీన్ పై కౌంట్‌డౌన్ ప్రక్రియను ఆగింది. దీంతో ఒక్కసారిగా ఏ మైందో ఏమో అందరిలోను ఉత్కంఠ.. పక్కనే షార్ ఉద్యోగుల్లో కూడా ఆందోళన. కొన్ని నిమిషాల్లోనే రిలేను కూడా ఆపివేయంతో సాంకేతిక లోపం తలెత్తిందని ప్రయోగం వాయిదా పడింది. కాని ఎందుకు.. ఏమిటి అన్న కారణాలను ఇస్రో ప్రకటించలేదు. కవరేజ్‌కు వెళ్లిన మీడియా వారు వెనుదిరిగారు.
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేపట్టేందుకు సిద్ధమైన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషాల్లో అనూహ్యంగా ఆగిపోయింది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 వాహక నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. సరిగ్గా ప్రయోగా సమయానికి 56 నిమిషాల 24సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను అర్థాతంగా నిలిపివేశారు. కాగా ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో ప్రతినిధులు మీడియాకు తెలిపారు. అయితే రాకెట్‌లోని లోపాన్ని ముందుగా పసిగట్టడం ఇస్రోకు ఒక అదృష్టమనే చెప్పాలి. రాకెట్ క్రయోజనిక్ దశలో ఇంజన్‌లో ఇంధనం లీకవుతున్నట్లు ప్రయోగానికి కొద్ధిగంటల ముందు శాస్తవ్రేత్తలు గుర్తించినట్లు సమాచారం. రాకెట్ పనితీరు నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం లేదు. ప్రయోగానికి ముందే దీన్న గుర్తించడం వల్ల అర్థాతంగా జాబిలమ్మ యాత్రను వాయిదా వేశారు. దీంతో రాకెట్‌తో పాటు ఉపగ్రహాన్ని సురక్షితంగా కాపాడుకోగలిగారు. రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం పై ఇస్రో ఒక నిపుణుల కమిటీ బృందాన్ని నియమించింది. ఈ కమిటీ సభ్యులు ప్రయోగ సమయంలో రాకెట్‌లో తలెత్తిన సమస్యను పరిశీలించనున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో ఆ కమిటీ గుర్తించి వెంటనే ఆ లోపాలను సరిచేసేందుకు మార్గాలను ఇస్రో అనే్వషిస్తున్నట్లు తెలిసింది. దీనికి వారం రోజులు పైబడి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రయోగం నిలిపివేసిన వెంటనే శాస్తవ్రేత్తలు రిస్కుతీసుకొని తీవ్రంగా మండే స్వభామున్న ధ్రవరూపంలోని హైడ్రోజన్, ఆక్సిజన్లను రాకెట్ల నుంచి వేరువేసి రాకెట్, ఉపగ్రహాన్ని సురక్షితం చేసినట్లు ఇస్రో వర్గాల ద్వారా తెలిసింది. కాని రాకెట్‌లో తలెత్తిన సమస్యను పూర్తిగా తెలుసుకోవడానికి రాకెట్‌ను పూర్తిగా విడదీయాల్సి ఉంటుందని సీనియర్ శాస్తవ్రేత్త ఒక్కరు తెలిపారు.
ఒక వేళ లోపాన్ని గుర్తించకుండా ప్రయోగం చేపట్టి ఉండే జాబిలియాత్ర మధ్యలోనే ఆగివుండేది. దీంతో దాదాపు ఈ ప్రయోగానికి ఖర్చుచేసిన దాదాపు వెయ్యికోట్లను బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలేది.
నెలాఖరులో చంద్రయాన్-2 ప్రయోగం ?
చంద్రయన్-2 ప్రయోగం మళ్లీ ఈ మాసంలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాకెట్, ఉపగ్రహం సురక్షితంగా ఉండడంతో ఇస్రోకు ఇది కలిసి వచ్చింది. లోపాన్ని గుర్తించి వెంటనే సరిచేసి ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. ప్రయోగాన్ని ఈ నెలలోనే నిర్వహించేందుకు లాంచ్ విండో సమయం ఉన్నట్లు ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఈ మాసంలో జూలై 1నుంచి 16 వరకు మళ్లీ నెలాఖరులో 29, 30తేదీల్లో కూడా లాంచ్‌విండో ఉండడంతో నెలాఖరులోనే ప్రయోగించేందుకు కసరస్తు చేస్తున్నారు.
చిత్రాలు..రాకెట్‌లోని క్రయోజనిక్ ఇంజిన్ ఇదే
*ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్న ఇస్రో ప్రతినిధులు