జాతీయ వార్తలు

రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: రహదారుల అభివృద్ధి విషయంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని వైసీపీ లోక్‌సభ సభ్యురాలు వంగా గీత కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది రోడ్లు, రహదారుల కేటాయింపులు, పద్దులపై లోక్‌సభలో జరిగిన చర్చలో వంగా గీత పాల్గొన్నారు. ఏపీ నూతన రాజధానికి అమరావతికి జాతీయ రహదారులను అనుసంధానం చేయాలని కోరారు. అమరావతి-అనంతపురం మధ్య 400 కిమీ ‘నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే’కి కేంద్ర ఆమోదముద్ర వేసిందని.. కాని పనులు నత్తనడకన జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఈ లైన్ విషయంలో కేంద్ర ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు. జాతీయ రహదారులలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలలో ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని గీత కేంద్రాన్ని కోరారు. విజయవాడలో చేపట్టిన బెంజి సర్కిల్ ప్లైఓవర్ రెండో విభాగం పనులను త్వరగా పూర్తి చేయాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని కేంద్రాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న విజయవాడ బైపాస్ రోడ్డు విస్తరణకు టెండర్ల ప్రకియను పూర్తి చేయాలని కోరారు. జాతీయ రహదారులలో సమయం ముగిసిన కొన్ని టోల్‌గేట్ల వద్ద వాహనదారుల నుంచి డబ్బు వసులు చేస్తున్నారని కేశినేని నాని గుర్తుచేశారు.
ఎన్‌ఐఏను మరింత బలోపేతం చేయాలి
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను మరింత బలోపేతం చేయాలని వైసీపీ లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్టంరాజు కేంద్రాన్ని కోరారు. ఎన్‌ఐఏ సవరణ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మనుషుల అక్రమ రవాణను నియంత్రించేందుకు ఈ సవరణ బిల్లు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు తమ పార్టీ సంపుర్ణ మద్దతు నిస్తుందని ఆయన ప్రకటించారు.