జాతీయ వార్తలు

దిగులొద్దు.. మేమున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/గౌహతి, జూలై 15: తీవ్రస్థాయిలో వర్షాలు, వరద పరిస్థితిని ఎదుర్కొంటున్న అస్సాంను అన్ని విధాలుగా ఆదుకొంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్‌తో సోమవారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రం తీవ్రస్థాయిలో నష్టపోయిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఘోరంగా దెబ్బతిందని, అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన వివరించారు.
వరద ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సంక్షేమ చర్యలు చేపడుతోందని మోదీ తెలిపారు. ప్రజలను అదుకొనేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని తరలించామని.. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు గరిష్ట స్థాయిలో చర్యలు చేపడుతున్నామని ప్రధానికి సోనోవాల్ తెలిపారు. వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయ పడాలని ప్రజా ప్రతినిధులను, మంత్రులను కోరామని వ్యక్తిగతంగా సహాయ చర్యల్లో పాల్గొనాలని కూడా వారికి విజ్ఞప్తి చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నిరంతరం వరద పరిస్థితిని గమనించి ఎలాంటి జాప్యం లేకుండా సహాయ చర్యలు చేపట్టేందుకు కంట్రోల్ రూంల ఏర్పాటు సహా రాష్ట్ర యంత్రాంగాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేశానని మోదీకి ఆయన వివరించారు. రాష్ట్ర పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్న మోదీ.. కేంద్రం నుంచి అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందుతాయని, యుద్ధ ప్రాతిపదికన సహాయ సంక్షేమ, పునరావాస చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు, వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు 119 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 24 గంటల పాటు పరిస్థితిని సమీక్షించేందుకు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పర్యవేక్షక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ బృందాలు తక్షణ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడతాయని ఓ అధికార ప్రకటనలో కేంద్రం తెలిపింది.
ఒక్కో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంలో 45మంది సభ్యులు ఉంటారని సహాయ చర్యలు చేపట్టడానికి అవసరమైన పడవలు, గజ ఈతగాళ్లు సహా అన్ని రకాల సామాగ్రిని ఈ బృందానికి అందించామని ఆ ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఈ బృందాలు సహాయ చర్యలు చేపట్టడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తమ వృత్తి నైపుణ్యానికి జోడిస్తాయని కేంద్రం పేర్కొంది. అస్సాంకు 14 బృందాలను పంపామని వెల్లడించింది. సహాయ సంక్షేమ చర్యలు చేపట్టడానికి స్థానిక పాలనా యంత్రాంగానికి ఈ బృందాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
చిత్రాలు.. నీట మునిగిన ఇంటి కప్పే ఆవాసం
*మంచినీటి కోసం ఆరాటం