జాతీయ వార్తలు

మండేలా నా మార్గదర్శకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా తనకు మార్గదర్శకుడని, ఎంతో స్ఫూర్తిని అందించిన వ్యక్తి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఒక సందర్భంలో తనతో మాట్లాడిన ఆయన ‘నువ్వెంతో ముందుగానే రాజకీయాల్లోకి వచ్చి వుండాల్సింది’ అని అన్నట్టుగా గుర్తుచేసుకున్నారు.
మండేలా 101వ జయంతి సందర్భంగా గురువారం ట్వీట్ చేసిన ప్రియాంక దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మండేలా చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ అనునిత్యం స్ఫూర్తి నిచ్చేదేనని పేర్కొన్నారు. మండేలా జీవితం స్వేచ్ఛ, ప్రేమ, సత్యవర్తనకు నిరుపమాన నిదర్శనమని ప్రియాంక పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండేలాతో తాను దిగిన ఫోటోను కూడా ప్రియాంక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.