జాతీయ వార్తలు

ఇక్కడ కాదు.. అక్కడ పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: కావేరీ జలాల వివాదంపై అధికార పార్టీ సభ్యురాలు అడిగిన ప్రశ్నపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ వ్యాఖ్యలు అన్ని పార్టీల సభ్యుల్లోనూ నవ్వులు పూయించాయి. ‘అక్కడకు పోరాడండి..ఇక్కడ కాదు’అని ఓ బిర్లా అన్నారు. గురువారం లోక్‌సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కావేరీ జలాల వివాదం వల్ల తమ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని కర్నాటక బీజేపీ ఎంపీ శోభా కరండ్లాజే అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న మంచి నీటి ఎద్దడికి కావేరీ సమస్య ఓ కారణమని ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు బెంచ్‌లపై ఆశీనులై ఉన్నారు. బీజేపీ సభ్యురాలి వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించారు. ‘మీరెళ్లి అక్కడ దెబ్బలాడండి..ఇక్కడ కాదు’అని స్పీకర్ ఓ బిర్లా అనగానే సభ్యులందరూ నవ్వేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ‘దేశంలోని అనేక రాష్ట్రాల మధ్య నీటి వివాదాలున్నాయి. న్యాయస్థానాల్లోనో, ట్రిబ్యునల్స్‌లోనూ కేసులను నడుస్తున్నాయి’అని అన్నారు. సంబంధిత రాష్ట్రాలు సహకరిస్తే నీటి వివాదాలు పరిష్కరించుకోవచ్చని మంత్రి తెలిపారు. దేశంలో 256 జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, వాటిని ఆధారంగా చేసుకుని 1,592 బ్లాక్‌లు ఎంపిక చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. 1592 బ్లాకుల్లో 312 తీవ్రమైనవిగా, 1,186 బాగా అడుగంటినవిగా, 94 బ్లాకుల్లో అత్యల్ప నీటి లభ్యత ఉన్నవిగా గుర్తించినట్టు షెకావత్ తెలిపారు. నీటి సంరక్షణపై జనంలో చైతన్యం తీసుకురావాల్సి ఉందని, దీనికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. సమగ్ర నీటి నిర్వహణ యాజమాన్య సమాచార విధానం(ఐఎంఐఎస్) అమలుచేస్తున్నట్టు ఆయన వివరించారు. గ్రామాల్లోని 17.87 ఇళ్లలో 3.27 కోట్లు అంటే 18.33 శాతం గృహాలకు మంచి నీటి కుళాయిల కనెక్షన్ ఉందని షెకావత్ స్పష్టం చేశారు. 2019-20 కేంద్ర బడ్జెట్‌లో అన్ని ఇళ్లకూ మంచి నీటి కుళాయిల కనెక్షన్ ఇవ్వాలని ప్రతిపాదించినట్టు జల్‌శక్తి మంత్రి వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కింద 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. జల్‌శక్తి అభియాన్ పేరుతో నీటి పరిరక్షణ కోసం ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని శాఖలు దీనిలో భాగస్వామ్యమవుతాయని షెకావత్ సభలో ప్రకటించారు.