జాతీయ వార్తలు

హోదా బాధ్యత వైసీపీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకురావాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులపై ఉందని తెలుగుదేశం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. గురువారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో కేశినేని నాని పాల్గొన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి ప్రకటించిన ప్రత్యేకహోదాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు అధికారం ఇస్తేరాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించుకొస్తామని వైసీపీ ప్రకటించిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ప్రత్యేక హోదా సాధించాలని నాని పేర్కొన్నారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు జోక్యం చేసుకుని గతంలో మీ పార్టీ బీజేపీతో కలిసివున్నప్పుడు ప్రత్యేక హోదాపై ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు, విభజన చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలకు ఈ బడ్జెట్‌లో నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదఇ అన్నారు. రెవిన్యూ లోటు భర్తీ చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణమని కేశినేని నాని అన్నారు.