జాతీయ వార్తలు

షీలా దీక్షిత్‌కు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌కు అభిమానులు, నాయకులు అశ్రునయానాలతో తుది వీడ్కోలు పలికారు. గుండెనొప్పితో శనివారం మరణించిన 81 ఏళ్ల షీలా దీక్షిత్‌కు కడసారిగా తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. బోరున వర్షం ఒకపక్క కురుస్తున్నా, బలమైన ఈదురు గాలులు వీస్తున్నా ఇక్కడి నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆదివారం జరిగిన మాజీ ముఖ్యమంత్రి షీలా అంత్యక్రియలకు అభిమానులు తరలిరావడం గమనార్హం. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఆమె కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా షీలా దీక్షిత్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, హోం మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు కూడా అంతిమ యాత్రకు హాజరయ్యారు. ఇదిలావుండగా, అంతకుముందు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన స్నేహితురాలైన షీలా దీక్షిత్ తనకు ఒక స్నేహితురాలే కాకుండా తనకు తోబుట్టులాంటివారని అభివర్ణించారు. షీలా దీక్షిత్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ సైతం షీలా దీక్షిత్ స్వగృహానికి చేరుకుని నివాళి అర్పించారు.
ఇదిలావుండగా, దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతదేహాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తరలించగా, ఎంతోమంది నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. వీరిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ ఉన్నారు. అనంతరం షీలా దీక్షిత్ మృతదేహాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించగా ఆమె స్నేహితులు, నాయకులు, కార్యకర్తలు షీలా దీక్షిత్ 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజులను మననం చేసుకున్నారు. షీలా దీక్షిత్ స్నేహితుడు, ఢిల్లీ మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు అనస్తాసియా గిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె బలమైన నిర్ణయాలు తీసుకోవడంలో చూపే తెగువను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అవినీతి ఆరోపణలకు ఎలాంటి తావు లేకుండా వాటికి వ్యతిరేకంగా పోరాడారని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీతో కలసి దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ నివాస గృహానికి వెళ్లారు.

చిత్రాలు..షీలా దీక్షిత్ మృతదేహానికి సోనియా, ప్రియాంక, కేజ్రీవాల్ నివాళి